మంచి క్రేజ్ ఉండి, ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి ఎలాగైనా అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలు రెడ్ కార్పెట్ పరిచి మరీ అవకాశాలు ఇస్తారు. అలాంటి ఫేమ్ ఉన్న సమయంలో పారితోషికం కోసం కక్కుర్తి పడితే అనవసరంగా పేరు పోతుంది. గతంలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమయంలో సమంత భారీ పారితోషికానికి అల్లుడు శీను చిత్రంలో కొత్త హీరో అయిన సాయి శ్రీనివాస్ సరసన గ్లామర్ గా ఆడిపాడింది.
ఆ సినిమా హిట్ అవ్వలేదు సరికదా సమంత కష్టం వృధా అయ్యింది. అప్పుడు భారీ పారితోషికానికి సమంత పడిపోయింది అందుకే ఇలా అనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే దారిలో శ్రీలీల నడిచింది. మంచి క్రేజ్ ఉంది. సౌత్ నుంచి నార్త్ వరకు బిజీ తార. అయినా పారితోషికం కోసం కొత్త హీరో తో కలిసి నటించింది.
గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి సరసన భారీ పారితోషికానికి పని చేసింది. జూనియర్ చిత్రంలో హీరో ఎలివేషన్ తప్ప శ్రీలీలది మరీ మొక్కుబడిగా సాగే పాత్ర. కేవలం పాటల కోసం మాత్రమే శ్రీలీల ఉపయోగపడింది. ఇది ఆమె ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. సినిమా హిట్టా అంటే అదీ లేదు.
మొదటి రెండు రోజులు హడావిడి చేసిన జూనియర్ కి ఇప్పుడు మరింత కష్టమొచ్చేసింది. అందుకే పారితోషికానికి కక్కుర్తి పడితే ఇలానే ఉంటుంది.. అప్పుడు సమంత, ఇప్పుడు శ్రీలీల అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.