Advertisementt

ఫైనల్లీ వీరమల్లు పై దర్శకుడు క్రిష్ ట్వీట్

Tue 22nd Jul 2025 12:01 PM
krish  ఫైనల్లీ వీరమల్లు పై దర్శకుడు క్రిష్ ట్వీట్
Krish Heartfelt Note On Hari Hara Veera Mallu ఫైనల్లీ వీరమల్లు పై దర్శకుడు క్రిష్ ట్వీట్
Advertisement
Ads by CJ

ఎంతో గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ తో పిరియాడికల్ డ్రామా హరి హర వీరమల్లు చిత్రాన్ని మొదలు పెట్టి ఓ 70 శాతం షూటింగ్ పూర్తి చేసాక దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. క్రిష్ తప్పుకున్నాక వీరమల్లు ని జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేశారు. ఆతర్వాత క్రిష్ అనుష్క తో ఘాటీ మూవీ స్టార్ట్ చేసుకుని విడుదలకు సిద్ధం చేసుకున్నారు. 

హరి హర వీరమల్లు విడుదలకు రెడీ అయిన సమయంలో క్రిష్ వీరమల్లు ప్రమోషన్స్ లో కనిపిస్తారని ఆశించారు. కానీ క్రిష్ వీరమల్లుని పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన దర్శకుడు క్రిష్ వ్యక్తిగత కారణాలతో, టెక్నీకల్ కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు, అయినా ఇంతటి భారీ ప్రాజెక్టు మొదలు పెట్టిన క్రిష్ కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. దానితో క్రిష్ కూడా హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 

ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే అది నిశ్శబ్దంగా కాదు ఈ సినిమాకి ఇద్దరు లెజెండ్స్ ఫ్యాషనేటెడ్ జర్నీతో వస్తుంది, ఏ ఎం రత్నం అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికీ నా సిన్సియర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని.. ఈ చిత్రం చేయడం తన కెరీర్ లోనే ఒక ఉద్వేగభరితమైన యుద్ధాల్లో ఒకటని.

కేవలం దర్శకునిగా మాత్రమే కాకుండా మర్చిపోయిన చరిత్రని అన్వేషించే వ్యక్తిగా కొన్ని నమ్మలేని నిజాల్ని వెతకడంలో అన్నింటికీ మించి వినోదాన్ని మరియు జ్ఞానాన్ని ఒకేసారి అందించే సినిమాపై నమ్మకం ఉన్న వ్యక్తిగా అంటూ హరి హర వీరమల్లు పై క్రిష్ ట్వీట్ చెయ్యగా అది ఇట్టే వైరల్ అయ్యింది. 

Krish Heartfelt Note On Hari Hara Veera Mallu:

Director Krish Pens Note About Pawan Kalyan And Hari Hara Veera Mallu

Tags:   KRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ