పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక ఆయన ఎక్కువగా రీమేక్స్ ను ఎంచుకోవడం ఆయన అభిమానులకు సుతరామూ ఇష్టం లేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా ఆయన చేస్తున్న రీమేక్స్ పై అభిమానులకు అభ్యంతరాలు ఉన్నాయి. హరీష్ శంకర్ తో పవన్ చేస్తున్న ఉస్తాద్ పై పవన్ ఫ్యాన్స్ చేసిన యుద్ధం అందరికి తెలిసిందే. హరి హర వీరమల్లు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ రీమేక్స్ విషయంగాను, అలాగే ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు.
నేను అసలు నటుడు అవ్వాలని కూడా కోరుకోలేదు. సగటు మనిషిగా బ్రతకాలన్న ఆలోచన తప్ప ఏంలేదు. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. పడినా, లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది.
అప్పటివరకు వరుస హిట్స్ ఇచ్చిన నేను.. జానీతో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు. దాని వల్ల డబ్బులు రావు. సినిమా చేసే డబ్బులు సంపాదించాలి. నా ఫ్యామిలీని పోషించుకోవాలి. నాతో ఖుషి సినిమా తీసిన రత్నం గారు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.
నేను రీమేక్ సినిమాలు చేయడం మీకు నచ్చకపోవచ్చు. నన్ను తిట్టుకుంటూ ఉంటారు. కానీ నా కుటుంబాన్ని పోషించడానికి, పార్టీని నడపడానికి తక్కువ సమయంలో డబ్బులు కావాలంటే రీమేక్ సినిమాలు చేయక తప్పలేదు. రీమేక్స్ అయితే సింపుల్ గా చేసెయ్యెచ్చు కదా అని అలా చేశాను. అంటూ పవన్ కళ్యాణ్ తను రీమేక్స్ కు ఎందుకు ఇంపోర్టన్స్ ఇస్తున్నారో వీరమల్లు ఈవెంట్ లో రివీల్ చేసారు.