సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండే త్రివిక్రమ్ పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా వదల్లేదు. త్రివిక్రమ్ రాసిచ్చే స్పీచ్ లు పవన్ నోటి వెంట వినిపిస్తాయి. వారి అనుబంధం వారి నోటి వెంటే ఎన్నోసార్లు విన్నాము. తాజాగా పవన్ కళ్యాణ్ మరోమారు త్రివిక్రమ్ తో అసలు స్నేహం ఎలా మొదలైందో పవన్ రివీల్ చేసారు.
నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది త్రివిక్రమ్ గారు. అంతకుముందు ఆయనతో అంతగా స్నేహం లేదు, మనకు పెద్దగా దర్శకులు లేరు. ప్లాప్ లో ఉంటే ఏ దర్శకుడు మన దగ్గరకు రారు. నేను వరసగా ప్లాప్స్ ఇచ్చినప్పుడు నన్ను వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మ బంధువు త్రివిక్రమ్..
వరస అపజయాల్లో ఉన్నప్పుడు నాతో జల్సా సినిమా తీశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి స్నేహితుడు త్రివిక్రమ్ గారు. అందుకే ఆయనంటే అంత గౌరవం, ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ తో స్నేహం గురించి చెప్పుకొచ్చారు.