ఒకప్పుడు విలన్ గా తర్వాత హీరోగా ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ నటుడిగా కెరీర్ ని మలచుకున్న శ్రీకాంత్ ఇప్పుడు తన కొడుకు రోషన్ ను హీరోగా నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. రోషన్ ఇప్పటికే నిర్మల కాన్వెంట్, పెళ్లి సందD లాంటి చిత్రాలు చేసారు. అయితే రోషన్ కోసం శ్రీకాంత్ డ్యూటీ ఎక్కారట.
వారసులు హీరోలుగా నిలదొక్కునేవరకు తండ్రులు వారికి సంబందించిన ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటారు. మెగాస్టార్ చిరు, నాగార్జున ఇలా ఎవ్వరికైనా అది తప్పలేదు. కొడుకులు హీరోలుగా నిలదొక్కుకున్నాకే వారి డెసిషన్ ని వారికి వదిలేస్తారు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా కొడుకు రోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
కొడుకు రోషన్ కోసం శ్రీకాంత్ ఏకంగా 50 స్క్రిప్ట్ లు విన్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఏ నిర్మాణ సంస్థ అయితే బావుంటుంది, ఏ దర్శకుడు అయితే రోషన్ షైన్ అవుతాడు, హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసేలాంటి స్క్రిప్ట్ దొరికేవరకు శ్రీకాంత్ కథలు వింటున్నారని, కొడుకు కోసం శ్రీకాంత్ చాలా కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు.