బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి హిందీలోకి ఎంటర్ అవుతుంది. ఆమె కార్తీక్ ఆర్యన్ తో కలిసి సినిమా షూటింగ్ చేస్తుంది. కానీ కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల కనిపించిన ప్రతిసారి వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బాలీవుడ్ మీడియా తో పాటుగా టాలీవుడ్ మీడియా వార్తలు వండి వారుస్తుంది.
అటువైపు శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ లు కూడా డేటింగ్ రూమర్స్ ని ఖండించకపోవడంతో ఆ రూమర్స్ అలా అలా ప్రచారంలోనే ఉన్నాయి. తాజాగా శ్రీలీల జూనియర్ ప్రమోషన్స్ లో భాగంగా డేటింగ్ రూమర్స్ కు భలే చెక్ పెట్టింది. మీరు పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ సుమ అడిగితే నాకింకా 24 ఏళ్ళే.
నేను 30 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ అటు పెళ్లి విషయమై క్లారిటీ ఇస్తూనే.. అమ్మ పక్కనే ఉంటే ప్రేమలో ఎలా పడతారండి అంటూ శ్రీలీల క్యూట్ గా స్వీట్ గా డేటింగ్ రూమర్స్ కు చెక్ పెట్టింది.