పవన్ కళ్యాణ్ ముందుగా హరి హర వీరమల్లు ట్రైలర్ చూసారు.. మెచ్ఛారు, దానిని ఆడియన్స్ చూసి ఇంప్రెస్స్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రాన్ని వీక్షించారని, ఆయనకు బాగా నచ్చేసింది అంటున్నారు. సినిమా ఫైనల్ వెర్షన్ ను పవన్ కళ్యాణ్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారని తెలుస్తుంది.
ఆ హ్యాపీ నెస్ తోనే రేపు సోమవారం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రెస్ మీట్ కోసం రాబోతున్నారని అంటున్నారు. ఇప్పటివరకు హరి హర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రాలేదు. అందరూ కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కనిపిస్తారని అనుకున్నారు.
కానీ రేపు సోమవారం ఉదయం హరి హర వీరమల్లు దర్శకనిర్మాతలు, టీమ్ అంతటితో కలిసి పవన్ ఇండియా ముందుకు వస్తున్నారు. అదే రోజు అంటే సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ వీరుమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. అయితే హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పలువురు రాజకీయ ప్రముఖులు రావడంతో ఈవెంట్ లో భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.