కాంగ్రెస్ వాళ్లలో సఖ్యత ఉండదు, వాళ్లలో వాళ్లే కొట్టుకు చస్తారు, సీఎం కుర్చీ కోసం ఎగబడతారు అనే నినాదాన్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు రుజువు చేస్తూనే ఉంటారు. సీనియర్ నేతలైనా, కుర్ర నేతలైనా ఎవ్వరైనా సీఎం కుర్చీ కోసమే ఆశపడతారు. తాజాగా కాంగ్రెస్ లో రెబల్ గా మారిన ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై కస్సుమన్నారు.
మునుగోడు బైపోల్ సమయం నుంచి రేవంత్ రెడ్డి లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి పాలమూరు సభలో వచ్చే పదేళ్లు నేనే సీఎం గా ఉంటా, కేసీఆర్ ఉరేసుకుంటావో, లేదంటే మారేదన్నా చేసుకుంటావో అంటూ రేవంత్ రెడ్డి దూకుడుగా చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఘరమ్ ఘరమ్ గా వైరల్ అయ్యింది.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.. అంటూ రాజ్ గోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ ట్వీట్ చేసారు.