Advertisementt

శ్రీలీల కు బాలీవుడ్ బంపర్ ఆఫర్

Sat 19th Jul 2025 11:25 AM
sreeleela  శ్రీలీల కు బాలీవుడ్ బంపర్ ఆఫర్
Sreeleela To Romance Ranveer Singh శ్రీలీల కు బాలీవుడ్ బంపర్ ఆఫర్
Advertisement
Ads by CJ

ఈమధ్యన బాలీవుడ్ శ్రీలీల నామ జపం చేస్తుందా అన్నట్టుగా ఆమెను హిందీ ప్రాజెక్ట్స్ లో కన్సిడర్ చేస్తూ ఉండడం బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతూ వస్తుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఆమె పేరు రెండుమూడు ప్రాజెక్ట్స్ లో వినిపించింది. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ లో శ్రీలీల పేరు వినబడుతుంది. 

రణ్వీర్ సింగ్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల కు అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. బాబీ డియోల్-రణ్వీర్ సింగ్ కలయికలో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ కి శ్రీలీల పేరు ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే బాబీ డియోల్, రణ్వీర్ సింగ్ లు తమ కసరత్తులు మొదలు పెట్టారని, ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఓకె అయితే ఆమెకు ఇకపై ఎదురుండదు అంటున్నారు. 

సౌత్ లో తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో శ్రీలీల బిజీగా వున్న సమయంలో, హిందీలో ఆమె ఇప్పటివరకు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాక ముందే ఇలాంటి బిగ్ ఆఫర్స్ రావడం ఆమె అదృష్టమే అంటున్నారు. 

Sreeleela To Romance Ranveer Singh:

Sreeleela To Romance Ranveer Singh After Kartik Aaryan

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ