తనదైన అందం, ఛరిష్మాతో యువతరం హృదయాలను గెలుచుకున్న మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ ఐటమ్ పాటలో నర్తించనుందా? అంటే.. అవుననే కథనాలొస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2లో ప్రత్యేక గీతంలో నర్తించాల్సిందిగా సంయుక్తకు చిత్రబృందం నుంచి కాల్ వెళ్లిందని తెలిసింది.
అయితే సంయుక్త ఇంకా డీల్ కి అంగీకరించలేదు. ప్రస్తుతం మంతనాలు సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖండ 2 చిత్రాన్ని బోయపాటి మ్యాసివ్ బడ్జెట్ లో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రగ్య జైశ్వాల్ ఒక కథానాయిక. గ్లామర్ ట్రీట్ తో పాటు, ఐటమ్ నంబర్ తోను రక్తి కట్టించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
బ్లాక్ బస్టర్ `అఖండ`కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన థమన్ `అఖండ 2` పాటలపైనా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక గీతం కోసం థమన్ బీట్ ఏ రేంజులో ఉండబోతోందో వేచి చూడాలి. ఒకవేళ ఈ చిత్రానికి అంగీకరిస్తే, మొదటిసారి సంయుక్త హెగ్డే తన ఇమేజ్ ని బ్రేక్ చేసి ఐటమ్ గాళ్ గా మారుతోందన్నమాట!