Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రీట్ రాబోతుంది

Sat 19th Jul 2025 10:32 AM
ustaad bhagat singh  ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రీట్ రాబోతుంది
Ustaad Bhagat Singh Treat Loading ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రీట్ రాబోతుంది
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టిన కొద్దిరోజులకే దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. అప్పటివరకు పవన్ అభిమానుల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా రోజుల పాటు షూటింగ్ కి బ్రేకివ్వాల్సి వచ్చింది. 

పవన్ కళ్యాణ్ వరస సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వీరమల్లు, OG షూటింగ్స్ ఫినిష్ చేసి జూన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లోకి రావడమే పవన్ కళ్యాణ్ చకచకా షూటింగ్ చేసేస్తున్నారు. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ను పర్ఫెక్ట్ గా వాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. 

ఇప్పటివరకు జరిగిన షూటింగ్ నుంచి హరిష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని, ఆగష్టు 15 కి ఉస్తాద్ నుంచి అభిమానుల కోసం అదిరిపోయే టీజర్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. మరి కొద్దిపాటి షూటింగ్ కే హరిష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే ట్రీట్ ఇచ్చరు. ఇపుడు ఇంకెలాంటి క్రిస్పీ ట్రీట్ సిద్ధం చేస్తారో అని అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు.  

Ustaad Bhagat Singh Treat Loading:

Ustaad Bhagat Singh Treat Coming Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ