హరి హర వీరమల్లు విడుదలకు కేవలం ఒక్క వారమే ఉంది. పాన్ ఇండియా మూవీ గా జులై 24 న విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు చిత్రం పై ఎంత క్రేజ్ ఉంది అనేది పవన్ ఫ్యాన్స్ కి అంతుబట్టడం లేదు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారనే ఉత్సుకత పవన్ ఫ్యాన్స్ లో ఎంతుంది, హరి హర వీరమల్లు కు మొదటిరోజు ఓపెనింగ్స్ ఎలా అందబోతున్నాయనే అనుమానాలు కామన్ ఆడియన్స్ మదిలో మెదులుతున్నాయి.
అదలా ఉంటే వీరమల్లు విడుదలకు వారమే ఉంది. హీరోయిన్ నిధి అగర్వాల్ హడావిడి, నిర్మాత ఏఎం రత్నం గారి సందడి తప్ప వీరమల్లు ప్రమోషన్స్ లో మరొకటి కనిపించడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ పక్కనపెట్టండి.. తెలుగు ఆడియన్స్ కు నిధి అగర్వాల్ ప్రమోషన్స్ సరిపోతాయా, ప్రీ రిలీజ్ ఈవెంట్ గొప్పగా అంటున్నారు.
ఆ హడావిడి ఇంకా కనిపించడమే లేదు. పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వస్తారా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరుపులు మెరిపిస్తారా, ఆయన ఒక్క ఇంటర్వ్యూ చేసినా సినిమాపై హైప్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ పేరుతొ మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ లేదు, మరి నిధి ఉదయం నుంచి రాత్రి వరకు మీడియా ఛానల్స్ కు ఇంటర్వూస్ ఇస్తుంది. అది మాత్రమే వీరమల్లుకు సరిపోతుందా.
ఇన్ని అనుమానాలు పవన్ ఫ్యాన్స్ లో నడుస్తున్నాయి. చూద్దాం హరి హర వీరమల్లు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది.