వైసీపీ పార్టీలో మాజీ ఎమ్యెల్యే గా, వైసీపీ అధికార ప్రతినిధిగా ఆర్కే రోజా వ్యవహరిస్తున్నారు. మరోపక్క జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కి జెడ్జిగానే కాదు స్కిట్స్ లోను రోజా హడావిడి మాములుగా లేదు. ఒకప్పుడు ఈటీవీలో అన్ని ప్రోగ్రామ్స్ లో కనిపించిన రోజా ఈటీవిని వదిలేసి జీ తెలుగులో ప్రత్యక్షమైంది. ఇక జీ తెలుగులో డ్రామా జూనియర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ లోను తెగ హడావిడి చేస్తుంది.
ఇకపోతే రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా లోకేష్ ను పప్పు పప్పు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. అదే రోజా ఇప్పుడు తనని లోకేష్ వెనకుండి నడిపించే టీడీపీ పెయిడ్ బ్యాచ్ అసభ్యకర మాటలంటున్నారు, నగరి ఎమ్యెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసారు, ఇదంతా లోకేష్ వెనకుండి నడిపిస్తున్నాడు అంటూ ఓ ఛానల్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకుంది.
ఓ ఛానల్ లైవ్ లో డిబేట్ లో ఉన్నప్పుడు రోజా కన్నీళ్లు పెట్టుకుంటూ నగరి ఎమ్యెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చెయ్యడానికి అంతధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది, అతని వెనుక లోకేష్ ఉన్నాడు కాబట్టే అతను నన్ను అంత దారుణంగా కామెంట్స్ చేసాడు. నా పిల్లల్ని కూడా వదలడం లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ చేత తిట్టించారు. నా కొడుకుకు మార్ఫింగ్ ఫొటోస్ పంపిస్తున్నారు. దానితో వాడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు. నా కూతురు వేధింపులు భరించలేక యుఎస్ వెళ్ళిపోయింది. నా కూతురికి ఫ్యామిలీని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. నేను రాజకీయాల్లో లేకపోతే పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్లు.. మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి.
అదే వాళ్ళ భార్యలను, పిల్లలను, కోడల్ని ఏమైనా అంటే ఊరుకుంటారా.. ఇంతకింత అనుభవిస్తారు. నేను సూసైడ్ చేసుకుంటే దానికి కారణమెవరు. ఆడదాని చేత కన్నీళ్లు పెట్టిస్తే లోపలి వెళతారు, బయటికి కూడా రారు, దేవుడనేవాడు ఉన్నాడు.. ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లెల్లా నన్ను చూసుకున్నారు. చిన్న సమస్య వచ్చినా, నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా నిలిచారు.
నేను మళ్ళీ గెలిచి ఇంతకు పదింతలు తిరిగి ఇస్తాను అంటూ రోజా భోరున ఏడ్చేయ్యడం చూసిన వాళ్ళు రోజా సింపతీ బాగానే వర్కౌట్ చేసుకుంటున్నావ్ గా, గతంలో నువ్వు అన్న మాటలు మరిచిపోతే ఎలా, ఇప్పుడు ఏదో మంచిదానిలా బిల్డప్ ఇస్తున్నావ్ అంటూ టీడీపీ కార్యకర్తలే కామెంట్లు పెడుతున్నారు.