రీసెంట్ గా ఉప్పుకప్పురంబు చిత్రంతో ఓటీటీ నుంచి ఆడియన్స్ ముందుకు నేరుగా వచ్చేసిన కీర్తి సురేష్.. ఆ చిత్ర రిజల్ట్ తో కాస్త డిజప్పాయింట్ అయ్యింది. హిందీలో బేబీ జాన్ అంటూ గ్లామర్ షో చేసిన కీర్తి సురేష్ కి ఆతర్వాత అక్కడ హిందీలో ఛాన్స్ లు వస్తున్నాయనే ప్రచారమే కానీ.. ఏ ఒక్కటి ఓకె అనుకున్న ప్రాజెక్ట్ లేదు.
ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కీర్తి సురేష్ సినిమాలు చేస్తుంది. గతంలోలా కాదు ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సై అంటుంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ఫొటోస్ తో జిగేల్ మనిపిస్తుంది. తాజాగా కీర్తి సురేష్ నుంచి వచ్చిన ఫొటోస్ చూస్తే వావ్ అనాల్సిందే.
అంత క్యూట్ గా అందంగా తయారై ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి సురేష్. Just some sarpanch things ఉప్పుకప్పురంబు ప్రమోషన్స్ షూట్ అంటూ ఆ ఫోటోలకు కీర్తి సురేష్ క్యాప్షన్ తగిలించింది.