ఈమధ్యన అనుష్క నటించిన ఘాటి వాయిదా పడడం, అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా అనుష్క పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. బాహుబలి రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ లో అనుష్క కనిపించకపోవడం మాత్రమే కాదు.. ఘాటి పదే పదే వాయిదా పడడం పైనా ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
జులై 11 నుంచి వాయిదా పడిన ఘాటీ విడుదల విషయంలో మేకర్స్ ఆలోచన ఎలా ఉందొ, అసలు ఘాటీ విఎఫెక్స్ పనులు పెండింగ్ కారణంగా పోస్ట్ పోన్ అన్నారు. అవి ఎప్పటికి పూర్తవుతాయి. క్రిష్ ఘాటీ రిలీజ్ విషయం లో ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు అంటూ అనుష్క అభిమానులు ఆతృతగా ఉన్నారు. తాజాగా ఘాటీ ని ఆగష్టు నుంచి కూడా స్కిప్ చేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
సెప్టెంబర్ 5 న ఘాటీ విడుదల చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట. ఈ విషయమై పూర్తి క్లారిటీ రానే అఫీషియల్ గా ఘాటీ విడుదల తేదీ అనౌన్స్ చేస్తారని సమాచారం. అదే రోజు పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కూడా గర్ల్ ఫ్రెండ్ తో పోటీపడబోతుంది అనే వార్త వైరల్ అయ్యింది. రష్మిక కుబేర హిట్ తర్వాత రాబోతున్న మూవీ కాబట్టి గర్ల్ ఫ్రెండ్ పై అంచనాలు భారీగానే ఉంటాయి.
మరి అనుష్క ఘాటి-రష్మిక గర్ల్ ఫ్రెండ్ రెండు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కాబట్టి ఈసారి సెప్టెంబర్ 5 బాక్సాఫీసు బరి హోరాహోరీగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.