ఎంతో సీక్రెట్ గా పకడ్బందీగా సినిమాలు చేస్తున్న హీరో అయినా, దర్శకుడైనా ఏదో ఒక సందర్భంలో ఆతృతను ఆపుకోలేక ఏదో ఒక స్టేజ్ పై తమ సినిమాల విషయాలను రివీల్ చేయడమనేది చాలాసార్లు చూస్తున్నాం. కానీ రాజమౌళి మాత్రం ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినా తన సినిమా అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా వెళుతున్నారంటే అది నిజంగా రాజమౌళికే సాధ్యమేమో.
సూపర్ స్టార్ మహేష్ తో SSMB 29 మొదలు పెట్టి ఆరేడునెలలవుతుంది. కానీ ఇంతవరకు రాజమౌళి అఫీషియల్ గా ఏ అప్ డేట్ వదల్లేదు. జనవరిలో సీక్రెట్ గా మొదలు పెట్టిన ప్రాజెక్ట్ షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ జరుపుకుంటుంది.. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ నటులు భాగమయ్యారు.. ఆ విషయాలన్నీ బయటికొచ్చేశాయి. కానీ రాజమౌళి మాత్రం మహేష్ మూవీపై ఇంతవరకు స్పందించలేదు.
పోనీ రాజమౌళి మీడియాకి కనిపించడం లేదా అంటే అదీ లేదు. ఆయన తరచూ ఏదో ఒక సినిమా ఈవెంట్ లో దర్శనమిస్తూనే ఉన్నారు. కానీ ఏ స్టేజ్ పై కూడా తను మహేష్ తో చేసున్న సినిమాపై ఎలాంటి క్లూ కూడా ఇవ్వకుండానే ఆ సినిమాల గురించి మాట్లాడేసి స్టేజ్ దిగేసి వెళ్లిపోతున్నారు.
ఇలా ఎవ్వరైనా చెయ్యగలరా.. ఆత్రుతతోనో, హైప్ క్రియేట్ చేయడానికో ఏదో ఒక సందర్భంలో అప్ డేట్స్ రివీల్ చేసేస్తారు. కానీ రాజమౌళి అలా కాదండోయ్.. ఆయన మామూలోడు కాదు అనేది అందుకే అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.