Advertisementt


థియేటర్స్ లోకి వచ్చిన ఒక్క రోజులో ఓటీటీలోకి

Thu 17th Jul 2025 10:50 AM
dna  థియేటర్స్ లోకి వచ్చిన ఒక్క రోజులో ఓటీటీలోకి
DNA OTT release date OUT థియేటర్స్ లోకి వచ్చిన ఒక్క రోజులో ఓటీటీలోకి
Advertisement
Ads by CJ

ఈమధ్యన చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదలైన రెండుమూడు వారాల లోపే ఓటీటీకి వచ్చేసి షాకిస్తున్నాయి. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా ఏదైనా సరే థియేటర్స్ కి రెండుమూడు వారాల గ్యాప్ లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతుంటే.. ఇక ప్రేక్షకులు థియేటర్స్ కి ఏం వెళతారు. 

మలయాళంలో ఆ మధ్యన థియేటర్స్ లో హిట్ అయిన ఐడెంటిటీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి థియేటర్స్ లో విడుదల చేసిన నెక్స్ట్ డే నే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఇప్పుడు అదే మాదిరి ఓ డబ్బింగ్ చిత్రం తెలుగులో విడుదలైన మరుసటి రోజే ఓటీటీలోకి రాబోతుంది. 

గత నెల జూన్ 20 న తమిళనాట విడుదలై సక్సెస్ అయిన అథర్వ నటించిన డీఎన్ఏ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి మై బేబీ గా రేపు అంటే జులై 18 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మేకర్స్ ప్రీమియర్స్ అంటూ తెలుగులో మై బేబీ తో హడావిడి చేస్తున్నా ఈ చిత్రం జులై 19 నుంచే ఓటీటీలోకి వస్తున్నట్లుగా అనౌన్స్ చేసారు. 

తమిళ్ సహా తెలుగు వెర్షన్ లో కూడా కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే అంటే జూలై 19 నుంచి ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా ఓటీటీ పార్ట్నర్ జియో ప్లస్ హాట్ స్టార్ ప్రకటించడంతో.. ఓ మై బేబీ థియేటర్స్ లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నావా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

DNA OTT release date OUT:

DNA is set to begin streaming on JioHotstar from July 19

Tags:   DNA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ