పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఫైనల్ గా డిసెంబర్ 5 విడుదల అంటూ మేకర్స్ టీజర్ వదిలి మరీ అఫీషియల్ గా తేదీని లాక్ చేసారు. పదే పదే రిలీజ్ డేట్ వాయిదా పడడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా.. డిసెంబర్ 5 న రాబోయే రాజా సాబ్ పై క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు.
దర్శకుడు మారుతి కూడా రాజా సాబ్ షూటింగ్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ముగించి గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. అటు ప్రభాస్ కూడా ఈనెలాఖరుకల్లా రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే డిసెంబర్ 5 న బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ నటించిన దురంధర్ పోటీకి రావడంతో ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలు నడిచాయి.
ఇప్పుడు కూడా సంక్రాంతికి రాజా సాబ్ రావొచ్చు, సంక్రాంతి సీజన్ అయితేనే రాజా సాబ్ కి వర్కౌట్ అవుతుంది.. అది ఓటీటీ డీల్ ని బట్టి ఫైనల్ అవుతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. రాజా సాబ్ ప్రొడ్యూసర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను రాజా సాబ్ డిసెంబర్ 5 నే వస్తుంది అంటున్నారు.
మరి రాజా సాబ్ సంక్రాంతి రిలీజ్ ఊహాగానాలు ఎవరో క్రియేట్ చేసి టీమ్ కి హెల్ప్ చేస్తున్నారో, లేదంటే అభిమానులను పక్కదారి పట్టిస్తున్నారో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకోవడం గమనార్హం.