నిజమే టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ బాక్సాఫీసు సైతం క్రేజీ సినిమాలు లేక కళ తప్పింది. 2025 జనవరి నుంచి స్టిల్ ఇప్పటివరకు బాక్సాఫీసు దగ్గర సినిమాలేవీ వరసగా సందడి చేసిన పాపాన పోలేదు. జనవరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి సీజన్ లో హడావిడి చేసాయి. ఫిబ్రవరిలో నాగ చైతన్య తండేల్ తప్ప మరో సినిమా లేదు. మార్చ్ లో చిన్న చిత్రం కోర్ట్ కదిలించింది.
ఇక ఏప్రిల్ నాలుగు వారాలు ఎలాంటి సినిమాలు లేక కరిగిపోయింది. మే హిట్ 3, సింగిల్ తో కళకళలాడినా, జూన్ లో మూడోవారం వరకు మళ్ళీ బాక్సాఫీసు బావురుమంది. కుబేర రెండు వారాలు కొట్టుకుపోయినా, కన్నప్ప ఒక మాదిరిగా ఆడినా, మళ్ళీ ఇప్పటివరకు బాక్సాఫీసుని కదిలించే సినిమా కానీ, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే మూవీ కానీ రాలేదు. జులై 4 న వచ్చిన తమ్ముడు బాగా డిజప్పాయింట్ చేసింది.
ఇక రాబోయే చిత్రాలు ఏమైనా బాక్సాఫీసు నిండుకుండలా మారుస్తాయేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జులై 24 హరి హర వీరమల్లు తో మొదలై జులై 31 న కింగ్ డమ్, ఆగష్టు 14 వార్ 2, కూలి ఇలా కాస్త క్రేజీ సినిమాలు కనబడుతున్నాయి. గత రెండు వారాలు, వచ్చే వారం కూడా చిన్న చిన్న సినిమాలు తప్ప నోటెడ్ సినిమాలేవీ రాకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు.
కళ తప్పిన బాక్సాఫీసుని హరి హర వీరమల్లు ఏమైనా ఊపును తెస్తుందేమో అనే ఆశ పవన్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ మూవీ లవర్స్ లోనే కనిపిస్తున్నాయి.