దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల కోసం ఎక్కువగా తనతో ఉన్న వాళ్ళతోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. కెమేరామ్యాన్ దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇలా ప్రతి ఒక్క టెక్నీకల్ టీం మొదటి నుంచి ఉన్నవారిని తనతోనే ఉండేలా చూసుకుంటారు. రాజమౌళి ఫ్యామిలీ మెంబెర్స్ అయిన ఆయన భార్య రమ, వదిన వల్లి, కొడుకు కార్తికేయ ఇలా అందరూ ఆయన సినిమా కోసమే పని చేస్తారు. అదే ఆయన బలం.
కానీ రాజమౌళి మొదటిసారి SSMB 29 కోసం మారిపోయారు. తనతో ట్రావెల్ చేస్తున్న టెక్నీకల్ టీం ని పక్కనపెట్టి SSMB 29 ప్రాజెక్ట్ లో కొత్తవారికి చోటివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయాన్ని రాజమౌళి సినిమాలకు పని చేసిన సెంథిల్ రివీల్ చేశారు, రీసెంట్ గా ఆయన మీడియతో మాట్లాడినప్పుడు ఆయన్ని SSMB 29 కి పని చేస్తున్నారా అని అడిగారు.
దానికి సెంథిల్ సమాధానమిస్తూ ఈసారి రాజమౌళి కొత్త వారికి అవకాశమిచ్చారు, అందుకే తను ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చెయ్యడం లేదు అని క్లారిటీ ఇవ్వడంతో.. అవును రాజమౌళి చాలా మారిపోయారు, మహేష్ మూవీ కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.