ఖైదీ చిత్రంతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరి ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో బాగా ఫేమస్ అయిన లోకేష్ కనగరాజ్ నుంచి ఇప్పుడు రాబోతున్న బడా మల్టీస్టారర్ మూవీ కూలి. ఆగష్టు 14 విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ నటించారు. కూలి చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి.
అయితే కూలి చిత్రానికి గాను లోకేష్ కనగరాజ్ కళ్ళు చెదిరే పారితోషికం అందుకున్నారనే వార్త వైరల్ అవడం కాదు.. అది నిజమే అంటూ ఆ ఫిగర్ ని కూడా లోకేష్ కనగరాజ్ బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. తను కూలి చిత్రానికి అక్షరాలా 50 కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా లోకేష్ కనగరాజ్ కన్ ఫర్మ్ చేసారు.
అవును 50 కోట్ల పారితోషికం తీసుకున్నాను, నేను తీసిన లియో 600 కోట్లు కలెక్ట్ చేసింది. అందుకే నాకు ఇంత పారితోశికం ఇచ్చారు. ఈ రేంజ్ కి రావడానికి నా రెండేళ్ల త్యాగం ఉంది. ఫ్యామిలీ, ఫంక్షన్స్, ఫ్రెండ్స్ ఇలా అన్ని వదులుకుని కష్టపడి పని చెయ్యడం వలనే నాకు ఈ గుర్తింపు దక్కింది, నేను పారితోషికం విషయం ఓపెన్ గా బయటికి చెప్పగలను, ఎందుకంటే నేను పన్నులు చెల్లిస్తాను కాబట్టి అంటూ లోకేష్ కనగరాజ్ తన పారితోషికం లెక్కలను కూలి ప్రమోషన్స్ లో బయటపెట్టారు.