తెలుగు చిత్రసీమలో ప్రముఖ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు 90 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయన వయసు సంబంధ సమస్యలకు చికిత్స పొందుతూ హైదరాబాద్ లని స్వగృహంలో మరణించారని సన్నిహితుల సమాచారం. రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన మద్ధతును, నివాళిని అందించారు.
సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను... అని చిరు సోషల్ మీడియాల్లో స్పందించారు.
రాజగోపాల్ కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రవితేజ పెద్దవాడు కాగా రఘురాజు, భరత్ రాజు వారసులుగా ఉన్నారు. వీరిలో భరత్ కొన్నేళ్ల క్రితం కార్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. తండ్రి రాజగోపాల్ ని కోల్పోవడం రవితేజకు పెద్ద లోటు. ఆయన పదవీ విరమణ చేసిన ఫార్మసిస్ట్. అతడి మరణానంతరం సినీపరిశ్రమ ప్రముఖులు, రవితేజ శ్రేయోభిలాషులు తమ సంతాపాన్ని తెలియజేశారు.