Advertisementt

ప్రభాస్ లో ఏదో పవర్ ఉంది-కన్నప్ప హీరోయిన్

Sun 13th Jul 2025 08:56 PM
preity mukhundhan  ప్రభాస్ లో ఏదో పవర్ ఉంది-కన్నప్ప హీరోయిన్
Kannappa heroine praising Prabhas ప్రభాస్ లో ఏదో పవర్ ఉంది-కన్నప్ప హీరోయిన్
Advertisement
Ads by CJ

ప్రభాస్ తో వర్క్ చేసిన ఏ హీరోయిన్ అయినా ప్రభాస్ వ్యక్తిత్వాన్ని, ఆయన చూపించే ప్రేమను, ఆయన ఇచ్చే ఆతిధ్యాన్ని పొగడకుండా ఉండలేరు. ప్రభాస్ సెట్ లో ఎలా ఉంటారో కూడా ఆయనతో పని చేసిన హీరోయిన్స్ ప్రత్యేకంగా చెబుతూ వుంటారు. ప్రభాస్ గురించి రీసెంట్ గానే రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ చెప్పింది. ప్రభాస్ ని మొదటిసారి చూడగానే అలసట ఎగిరిపోయింది అని. 

ఇప్పుడు కన్నప్పలో పని చేసిన హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రభాస్ ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కన్నప్ప షూటింగ్ సమయంలో ప్రభాస్ తో వర్క్ చెయ్యడం పై ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రభాస్ గారితో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. 

ప్రభాస్ లో చాలా బలమైన వ్యక్తిత్వం ఉంది. ప్రభాస్ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ ఎవరినీ చిన్న చూపు చూడరు. సెట్‌లో అందరితో ప్రభాస్ చాలా స్నేహంగా, అంతే గౌరవంగా ఉంటారు. ప్రభాస్ తనకు ఉన్న క్రేజ్ ను, స్టార్‌డమ్‌ను ఎప్పుడూ ప్రదర్శించరు. చాలా సాధారణ వ్యక్తిలా మాతో కలిసిపోయేవారు అని చెప్పిన ప్రీతి ముకుందన్ ఆయన అంత పెద్ద స్టార్ అయినా ఆయనతో మాట్లాడేటప్పుడు ఎపుడు భయం అనిపించలేదు. 

ప్రభాస్ చాలా ఓపెన్‌గా ఉంటారు. ప్రభాస్ సెట్‌లో ఉన్నప్పుడు చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆయన సహనానికి, మంచితనానికి నేను ముగ్ధురాలైపోయా అంటూ ప్రీతీ ముకుందన్ ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను రివీల్ చేసింది. 

Kannappa heroine praising Prabhas:

Preity Mukhundhan says Prabhas has a powerful aura

Tags:   PREITY MUKHUNDHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ