ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ఫిలింనగర్ లోని ఆయన నివాసంలోనే నిన్న ఆదివారం తెల్లవారుఝామున కన్ను మూసారు. అనారోగ్య కారణాలతో కోట మృతి చెందడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. గొప్ప నటులను సినిమా పరిశ్రమ కోల్పోయింది. సోషల్ మీడియా వేదికగా కోట కు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేసారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. బ్రహ్మి, చిరు లు కోట భౌతిక కాయం వద్ద ఎమోషనల్ అయ్యారు. అయితే నిన్న మూడు గంటల ప్రాంతంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలను కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వాహించారు.
జూనియర్ ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావు మరణ వార్త విని ఆయన షూటింగ్ కోసం వేరే ప్రదేశంలో ఉండగా.. గత రాత్రి కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన భార్య, కుమార్తెలను, అలాగే మనవడిని పరామర్శించి, కోట శ్రీనివాసరావు భార్య కి ధైర్యం చెప్పారు.. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. లెజెండరీ నటులను కోల్పోవడం చాలా బాధాకరం, ఆయన మరణంతో ఒక శకం ముగిసింది, ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో పని చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను, మహనీయుడుతో పని చెయ్యడం నా పూర్వజన్మ సుకృతం, ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.