వైసీపీ నేత కాదు కాదు వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నపుడు అతను పర్సనల్ లైఫ్ లో పార్టీ పరువు పోయేలా నడుచుకోవడమే కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన గర్ల్ ఫ్రెండ్ దివ్వెల మాధురి ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం, అలాగే కరెంట్ బిల్ పే చెయ్యకుండా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి బూతులు తిట్టడం వంటి విషయాలతో జగన్ మోహన్ రెడ్డి దువ్వాడను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.
అయితే దివ్వెల మాధురి వల్లే దువ్వాడ కి పార్టీ లో చోటు లేకుండా పోవడంతో ఇప్పుడు దువ్వాడ చిరుని దువ్వే పనిలో పడ్డారు. మెగాస్టార్ ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు దువ్వాడ ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నారు. ఆయన ఎమ్యెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తను ఓడిపోయినప్పుడు తనకు చిరు డబ్బులిచ్చి ఆదుకున్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తను ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన్నప్పుడు చిరు ఫోన్ చేసి పార్టీ కోసం పని చేసావు, ఎన్నికల్లో ఓడిపోయావు కదా, డబ్బులు నష్టపోయి ఉంటావు, మనందరం వైస్సార్ హవాలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టి డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతుంటావు. ఈ సాయం తీసుకో అంటూ ఫోన్ చేసి ఆదుకున్నారు అంటూ చిరుని ఓ రేంజ్ లో పొగిడేశారు.
అయితే దువ్వాడ చిరుని ఈ సమయంలో పొగడడం పట్ల రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందరూ దువ్వాడ మొన్నటివరకు పవన్ ని తిట్టారు, ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు చిరుని పోగుడుతున్నారు. వైసీపీ లో డోర్స్ క్లోజ్ అయ్యాయి, జనసేనలోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఈ చిరు భజన చేస్తున్నాడు దువ్వాడ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.