డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా కానీ నటులు ఎవరైనా ఉంటే చూపించండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎదుకంటే ప్రభాస్ తన తోటి నటులకు సినిమా సెట్ లోకి క్యారీర్ క్యారీర్ లు పంపిస్తూ ఉంటారు. అవి తిన్న వాళ్ళంతా ప్రభాస్ ఆతిథ్యానికి పొంగిపోతూ సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకుంటారు.
ప్రభాస్ తో పని చేసిన హీరోయిన్ అయితే ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యానికి ముగ్దులైపోతుంటారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ అయితే ప్రభాస్ పంపించిన ఫుడ్ ఎన్ని రోజులు తిన్నా తరగదు అంటూ సలార్ సమయంలో చెప్పుకొచ్చారు. దీపికా, కృతి సనన్, శ్రద్ద కపూర్, కరీనా కపూర్, మాళవిక మోహనన్ ఇలా ప్రభాస్ తో వర్క్ చేసిన హీరోయిన్స్ అంతా ప్రభాస్ పంపిన ఫుడ్ పై గొప్పగా మాట్లాడిన వాళ్ళే.
తాజాగా ఆ లిస్ట్ లోకి రాజా సాబ్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేరారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా తింటూనే ఉన్నాను. అది మా హీరో ప్రభాస్ వల్లే అంటూ రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చారు. దీనితో మరోసారి డార్లింగ్ ప్రభాస్ ఇచ్చే ఆథిత్యం కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజా సాబ్ లో సంజయ్ దత్ ప్రభాస్ కి తాతయ్యగా నటిస్తున్న విషయం తెలిసిందే.