ఇండస్ట్రీ హిట్స్ లో నటించి హీరోలతో సమానమైన పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా భయపడుతుంది. ఆమె సైజ్ జీరో కోసం పెరిగిన వెయిట్ దించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కానీ గతంలోలా అనుష్క బరువు తగ్గలేదు, దానితో ఆమె బయటకు రావడమే మానేసింది.
ఆమె నటించిన ఘాటీ విడుదల సమయంలో ప్రమోషన్స్ కు వస్తుందా, రాదా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎపిక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ లో బాహుబలి హీరో ప్రభాస్, రాజమౌళి, నిర్మాతలు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటే బాహుబలి 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో అనుష్క శెట్టి కనిపించకపోవడం ఆమె అభిమానులకు షాకిచ్చింది.
రాజమౌళి, ప్రభాస్, రానా తో సహా చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ రీ యూనియన్ లో మెరిశారు. కానీ అనుష్క మాత్రం కనిపించలేదు. మరి అనుష్క ఈమధ్యన చాలా లావైపోయింది, అందుకే ఆమె మీడియా ముందుకు కానీ, ఇతరుల ముందు పబ్లిక్ గా వచ్చే సాహసం చెయ్యడం లేదు అంటున్నారు. కొంతమంది మాత్రం బాహుబలి రీ యూనియన్ కి అనుష్క వచ్చింది కానీ ఫోటోలకు ఫోజులివ్వలేదు అంటున్నారు. ఎన్నాళ్లిలా అనుష్క హైడ్ అవుతుందో చూడాలి.