రీసెంట్ గా నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పడిన ఓ పోస్ట్ చూసిన వారంతా నయనతర ఆమె భర్త విగ్నేష్ శివన్ తో విడిపోతుంది. తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కన్నా పొరబాటు మరొకటి లేదు, నీ భర్త చేసే తప్పులకు నువ్వు బాధ్యత కాదు అంటూ నయన్ పోస్ట్ పెట్టింది. విగ్నేష్ శివన్ కెరీర్ లో ఫెయిల్ అవడంతో విసిగిపోయిన నయనతార ఈ రకమయిన పోస్ట్ పెట్టింది అంటూ చాలామంది నయనతార-విగ్నేష్ జంట విడాకులు విడిపోతుంది అంటూ అపార్ధం చేసుకున్నారు.
ఆతర్వాత నయనతార తన కొడుకులు, అలాగే భర్త తో కలుసి ఓ గుడిలో సాష్టాంగ నమస్కారాలు చేస్తూ స్పెషల్ పూజలు చేసిన వీడియోస్, ఫొటోస్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విడాకుల వార్తలపై నయనతార సూపర్ గా రియాక్ట్ అయ్యింది.
భర్త విగ్నేష్ శివన్ తో కలిసి రొమాంటిక్ గా దిగిన పిక్ ని షేర్ చేస్తూ.. మాపై వచ్చే సిల్లీ రూమర్స్ చూసినప్పుడు మా నుంచి వచ్చే రియాక్షన్ ఇదే అంటూ నయనతార భర్త తో దిగిన క్యూట్ ఫోటో పాటుగా తన పై వచ్చే పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.