జబర్దస్త్ లో ఇప్పుడు మెగా సెలబ్రేషన్స్ జరగబోతుంది.. కాదు జరిగిపోయింది. అందులో భాగంగానే ఓ ప్రోమో కూడా వదిలారు. ఆ జబర్దస్త్ మెగా సెలబ్రేషన్స్ ఎపిపోడ్ ప్రోమోలో ఎప్పుడో జబర్దస్త్ ని వదిలేసి, జబర్దస్త్ పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపించారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ప్రోమో చివరిలో డైలాగ్ కూడా వినిపించారు.
మరి ఈ మెగా సెలబ్రేషన్స్ ఎపిసోడ్ లో నాగబాబు మాత్రమే కాదు.. జబర్దస్త్ స్టార్టింగ్ లో ఉన్న ధనరాజ్, చమ్మక్ చంద్ర, వేణు లాంటి వాళ్ళు కూడా ఈ మెగా సెలబ్రేషన్స్ ఎపిసోడ్ లో కనిపించారు. కానీ జబర్దస్త్ కు ఎన్నో ఏళ్లుగా వన్ ఆఫ్ ద జెడ్జిగా ఉన్న రోజా మాత్రం కనిపించలేదు. మరి రోజా ను ఇన్వైట్ చెయ్యలేదా.. లేదంటే చేసినా రాలేదా అనేది క్యూరియాసిటిగా మారింది.
ఒకప్పుడు నాగబాబు-రోజాలు జెడ్జి లుగా జబర్దస్త్ ని ముందుండి సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఆతర్వాత అంటే నాగబాబు వెళ్ళిపోయాక కూడా రోజా చాన్నాళ్లు జబర్దస్త్ లో కనిపించినా మినిస్టర్ పదవి వచ్చాక ఆమె జబర్దస్త్ మానేసింది.
ఇప్పుడు ఆమె కనీసం ఎమ్యెల్యేగా కూడా గెలవలేదు. అందుకే తిరిగి బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఈటీవికి వెళ్లకుండా జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కి జెడ్జిగా చేస్తూ పిల్లలతో కలిసి స్కిట్స్ చేస్తుంది. మరి రోజా బుల్లితెర పై లేదు అనుకుంటే అలా ఏమి లేదు, ఆమె జీ తెలుగులో కనిపిస్తుంది. మరి రోజాను పిలిస్తే నాగబాబు రానన్నారేమో అందుకే ఈటివి యజమన్యం రోజాను పక్కనపెట్టింది అని మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.