రెండేళ్ల తర్వాత హరిహర వీరమల్లు చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 24 న వీరమల్లు విడుదలకు సిద్దమైంది. ఎన్నిసార్లు విడుదల వాయిదా వేసినా.. హరి హర వీరమల్లు ట్రైలర్ తో లెక్కలన్నీ సరిచేశారు మేకర్స్. వీరమల్లు ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోతున్నాయి.
హరి హార వీరమల్లు ప్రమోషన్స్ ను పవన్ కళ్యాణ్ పక్కనపెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటునప్పటికీ.. నిర్మాత ఏఎం రత్నం మాత్రం వీరమల్లుని భుజాన మోస్తున్నారు. మొదటినుంచి ఆయన ప్రమోషన్స్ లో హైలెట్ అవుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వీరమల్లు పాత్రలో పవన్ ఎలా ఉండబోతున్నారో క్రేజీగా రివీల్ చేసారు.
హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ అనాథగా కనిపిస్తాడని, వరదల్లో కొట్టుకుపోతున్న చిన్న బిడ్డను కాపాడి ఒక గుడిలో పెంచితే.. అతను సనాతన ధర్మ పరిరక్షకుడిగా వీరమల్లు గా మారుతారని రత్నం పవన్ కేరెక్టర్ ని రివీల్ చేసారు. ఔరంగజేబు నుంచి సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో.. అతడికి వ్యతిరేకంగా పోరాడే యోధుడి పాత్రలో పవన్ కనిపిస్తాడని ఏఎం రత్నం చెప్పారు.
అంతేకాకుండా విష్ణువు, శివుడి పాత్రల కలయికగా వీరమల్లు క్యారెక్టర్ ఉంటుందని, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లో పాటించే అనేక విషయాలను సినిమాలోనూ చూపించామని చెప్పుకొచ్చారు.