వైసీపీ అధికారం చేపట్టాక ఆయన ఎమ్యెల్యేలు, జగన్ కింద మంత్రులుగా పని చేసినవారి నోటి దురుసు ప్రభావం అందరూ చూసారు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా ఇలా చాలామంది వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోవడం వేరు, బూతులు తిట్టడం వేరు. కొడాలి నాని లాంటి వాళ్ళు అడ్డుఅదుపులేకుండా వాగినా ఏనాడూ జగన్ మోహన్ రెడ్డి వారిని కంట్రోల్ చెయ్యలేదు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్యెల్యేలను అలా మాట్లాడకూడదు అని చెప్పలేదు. ఫలితం 2024 ఎన్నికల్లో పవర్ ఫుల్ కేండిడేట్స్ అందరూ ఓడిపోయి కూటమి ప్రభుత్వానికి భయపడి కామ్ గా కూర్చున్నారు. ఇప్పుడు అధికారం పోయాక కూడా వైసీపీ నేతలు ఇష్టం వచ్చిన రీతిలో రెచ్చిపోతున్నారు.
టీడీపీ మహిళా ఎమ్యెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. నల్లపురెడ్డి మాటలు సొంత పార్టీ వారినే ఇబ్బందిపెట్టేలా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై జగన్ స్పందించకపోవడంపై బ్లూ మీడియా జగన్ ని మేలుకొలుపుతుంది.
ఇప్పటికైనా జగన్ ఇలాంటి వారిని అడ్డుకోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలని, అలా సైలెంట్ గా చూస్తూ ఉంటే.. టీడీపీ కార్యకర్తలు నల్లపురెడ్డి ఇంటిపై దాడి చెయ్యడం సరైన నిర్ణయమే అవుతుంది, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు అని జగన్ వారించాలి అంటూ బ్లూ మీడియా జగన్ నుహెచ్చరిస్తుంది. ఇప్పటికైనా జగన్ మారాలి అంటూ బ్లూ మీడియా జగన్ కు సలహాలు ఇస్తోంది.