బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం భైరవం మే 30న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు చేసిన పర్ఫామెన్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం భైరవం థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ మూవీ జూలై 18న ఈ చిత్రం జీ5లోకి రాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో భైరవం మూవీ జీ5లో ఆడియెన్స్‌కి అందుబాటులో ఉండనుంది. థియేటర్లో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రానుంది.