కోలీవుడ్ హీరో ధనుష్-కింగ్ నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం జూన్ 20 న విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అటు తమిళనాట, అలాగే హిందీ మర్కెట్ లో కుబేర చిత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. తెలుగులో భారీ హిట్ గా నిలిచిన కుబేర చిత్రం ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.
కుబేర చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో అన్ని లాంగ్వేజెస్ కి కలిసి దాదాపుగా 50 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ కి వచ్చినట్లుగా టాక్ ఉంది. అయితే కుబేర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ నుంచి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వదులుతారో అంటూ చాలామంది వెయిట్ చేస్తున్నారు.
అయితే అమెజాన్ ప్రైమ్ నుంచి కుబేర చిత్రం త్వరలోనే స్ట్రీమింగ్ లోకి రానుంది అని తెలుస్తుంది. జూలై 20న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే కుబేర సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వస్తుంది అని సమాచారం.