టాలీవుడ్ లో వరస డిజాస్టర్స్ ఉన్నప్పటికి హిందీలో వరస సినిమా ఆఫర్స్ శ్రీలీల ఖాతాలోకి పడుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ తో కలిసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పుష్ప 2 లో చేసిన కిస్సిక్ స్పెషల్ సాంగ్ ఆమెను హిందీలో బిజీ అయ్యేలా చేసింది. తెలుగులో రవితేజ తో చేసిన మాస్ జాతర ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈలోపు ఆమె టాలీవుడ్ లో అఖిల్ లెనిన్ నుంచి తప్పుకొవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. హిందీ మోజులో పడి ఆమె బంగారంలాంటి లెనిన్ ని వదిలేసింది అన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ లో బిజీగా వుంది.
రీసెంట్ గా అమెరికా నాటా ఈవెంట్ లో అల్లు అర్జున్, సుకుమార్ లతో కలిసి కనిపించి సందడి చేసిన శ్రీలీల తాజాగా షేర్ చేసిన పిక్స్ మీడియాలో కూల్ గా ట్రెండ్ అవుతున్నాయి. జిగేల్ మనిపించే డ్రెస్సులో శ్రీలీల నిజంగా క్యూట్ గా కత్తిలా కనిపించింది.