హిందీ సీరియల్స్ లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన మృణాల్ ఠాకూర్ ఆతర్వాత హీరోయిన్ గా మారి సీతారామం చిత్రంలో సీత గా సౌత్ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకుంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రల్లో బ్యాక్ టు బ్యాక్ నటించింది. ప్రెజెంట్ తెలుగులో అడివి శేష్ డెకాయిట్ లో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కెరీర్ ఆరంభంలో ఆమె ఎదుర్కున్న సవాళ్ళను, ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
కెరీర్ స్టార్టింగ్ లో ఆఫర్స్ లేక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడ్డానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాక అవకాశాలు రాక, ఆ ఆలోచనలతో ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక దశలో లోకల్ ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాను..
కానీ అలాంటి తీవ్రమైన ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారిగా నా పేరెంట్స్ ముఖాలు గుర్తొచ్చాయి. వారిని తలుచుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాను అంటూ మృణాల్ ఠాకూర్ డిప్రెషన్ లోకి వెళ్లి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, తను వాటిని ఎదుర్కోవడం గురించి చెప్పడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.