Advertisementt

వంశీకి అనారోగ్యం-ఆసుపత్రికి తరలింపు

Mon 07th Jul 2025 08:58 PM
vallabhaneni vamsi  వంశీకి అనారోగ్యం-ఆసుపత్రికి తరలింపు
Vallabhaneni Vamsi suffers health issues వంశీకి అనారోగ్యం-ఆసుపత్రికి తరలింపు
Advertisement
Ads by CJ

వైసీపీ నేత వల్లభనేని వంశీ రీసెంట్ గానే జైలు నుంచి విడుదలయ్యారు. 137 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలైన వల్లభనేని వంశీ తర్వాత తమ నేత వైస్ జగన్ ను కలిసి వచ్చారు. వంశీ ని జైలు నుంచి బయటికొచ్చాక పేర్ని నాని, కొడాలి నాని లు వంశీ ని కలిసి వచ్చారు. 

ప్రస్తుతం ఆయన తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వంశీ కి జైలులో ఉన్నప్పుడు కూడా శ్వాస సంబంధిత అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వంశీకి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తడంతో, కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. 

Vallabhaneni Vamsi suffers health issues:

Vallabhaneni Vamsi at hospital

Tags:   VALLABHANENI VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ