Advertisementt


ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తా అంటున్న రష్మిక

Mon 07th Jul 2025 08:30 PM
rashmika  ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తా అంటున్న రష్మిక
Why do Rashmika friends not include her in their plans ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తా అంటున్న రష్మిక
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ ఇలా మూడు లాంగ్వేజెస్ లోను క్రేజీ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అన్ని భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కొన్నిసార్లు అనుకోకుండా చేసే కామెంట్స్ కాంట్రావర్సీలకు నెలవుగా మారుతున్నాయి. 

చెన్నై, ముంబై, హైదరాబాద్ అంటూ షూటింగ్స్ లో మునిగిపోయే రష్మిక మందన్న తన ఫ్యామిలీతో గడిపే సంతోషాలను మిస్ అవుతున్నట్లుగా చెప్పి తెగ ఫీలైపోతుంది. రష్మిక అసలు తన ఇంటికి వెళ్లి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి చాలా రోజులే అవుతోందట. ఏడాదిన్నర కాలంగా ఇంటికి వెళ్లకుండానే రష్మిక షూటింగ్స్ తో బిజిగా గడిపేస్తుంది. 

రశ్మికకు ఓ చిట్టి చెల్లెలు ఉంది, తన చెల్లిని రష్మిక చాలా మిస్ అవుతోందట. సినిమాల్లోకి రాకముందు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చెల్లితో ఎక్కువగా టైం గడిపిన రష్మీకి ఇప్పుడు వాళ్లతో మాట్లాడేంత టైం కూడా ఉండటం లేదని వాపోతుంది. ఒకప్పుడు తాను లేకుండా ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గాని వెకేషన్‌లకు వెళ్లే వారు కాదు కానీ ఇప్పుడు తనకు చెప్పడం, తనను కనీసం అడగటం కూడా మానేసి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారట . 

రష్మిక ఎలాగూ బిజీగా ఉంటుంది.. రాదు కదా, అని తనను లైట్ తీసుకున్నారట. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదిలేయాల్సి వస్తుందని, పర్సనల్ లైఫ్ కావాలని అనుకుంటే.. ప్రొఫెషనల్ లైఫ్‌ను త్యాగం చేయాల్సి వస్తుందని, ప్రొఫెషనల్ లైఫ్ కావాలని అనుకుంటే.. పర్సనల్ లైఫ్‌లో కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని తన తల్లి ఎప్పుడో తనకు చెప్పింది అని కానీ.. తను మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్టుగా రష్మిక చెప్పుకొచ్చింది. 

Why do Rashmika friends not include her in their plans:

Rashmika: I sacrificed my personal life for my career

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ