Advertisementt


క‌త్రిన అంతటి అందం ఉన్నా కానీ..!

Tue 08th Jul 2025 09:44 AM
katrina kaif  క‌త్రిన అంతటి అందం ఉన్నా కానీ..!
Zareen Khan shares throwback video of taking Katrina Kaif autograph క‌త్రిన అంతటి అందం ఉన్నా కానీ..!
Advertisement
Ads by CJ

కొంద‌రిని దుర‌దృష్ట నాయికలు అనాలి. అందం అభిన‌యం ఉన్నా కానీ.. కొంద‌రికి ల‌క్ క‌లిసి రాదు. ఇదే కోవ‌కు చెందుతుంది జ‌రీన్ ఖాన్. ఈ భామ అచ్చం క‌త్రిన కైఫ్ లా ఉంటుంది. త‌న‌ను స‌ల్మాన్ భాయ్ `వీర్` అనే చిత్రంతో వెండితెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసాడు. కానీ మొద‌టి సినిమాలో అంత‌గా అభిన‌యం కుద‌ర‌క‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

అంతేకాదు.. బాలీవుడ్ లో జ‌రీన్ ఖాన్ కెరీర్ ఓ వెలుగు వెలుగుతుంద‌ని భావించినా కానీ, ఆశించిన‌ది జ‌ర‌గ‌లేదు. పైగా స‌ల్మాన్ ఖాన్ ప‌రిచ‌యం చేసాడు కాబ‌ట్టి, పెద్ద స్థాయి న‌టి అంటూ కొంద‌రు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ట‌. గ‌ర్విష్ఠి అని కూడా ప్ర‌చారం సాగింద‌ని తెలిపింది జ‌రీన్. ఒక‌రిలా ఉండ‌టం ఒక ర‌కంగా ప్ల‌స్ అయినా, చాలా ర‌కాలుగా మైన‌స్ అవుతుంద‌ని తెలుసుకున్నాన‌ని కూడా జ‌రీన్ ఖాన్ వెల్ల‌డించింది. జ‌రీన్ ఆశించిన కెరీర్ లేక ఆదాయం లేక నెమ్మ‌దిగా సినీప‌రిశ్ర‌మ‌కూ దూర‌మైంది. 

ఇంతకుముందు జ‌రీన్ ఖాన్ టాలీవుడ్ లో గోపిచంద్ హీరోగా న‌టించిన `చాణ‌క్య‌` చిత్రంలో ఒక ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. 2012లో హంబీ ఆక‌లే తుంబీ ఆక‌లే అనే చిత్రం జ‌రీన్ న‌టించిన చివ‌రి చిత్రం. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా అవ‌కాశాల్లేవ్. క‌త్రిన అంత‌టి అంద‌గ‌త్తె.. అయినా త‌న‌కు ప‌రిశ్ర‌మ అవ‌కాశాలు క‌ల్పించ‌లేదు. తాజాగా జ‌రీన్ ఖాన్ త‌న ఫేవ‌రెట్ క‌త్రిన‌తో ఫ్యాన్ గ‌ర్ల్ మూవ్ మెంట్ కి సంబంధించిన వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

Zareen Khan shares throwback video of taking Katrina Kaif autograph:

Katrina Kaif wide-eyed fan Zareen Khan shares old video

Tags:   KATRINA KAIF
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ