అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అటు బుల్లితెర ఇటు వెండితెర ముఖ్యంగా సోషల్ మీడియాలో అనసూయ అందాల జాతర ఆమెకు విపరీమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. చీరకట్టు అయినా, గ్లామర్ గా మోడ్రెన్ డ్రెస్ వేసినా ఆమె ముందుగా సోషల్ మీడియాలోనే షేర్ చేస్తుంది.
గతంలో చేసిన జబర్దస్త్, ఆ తర్వాత కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో లో అనసూయ అందాల గురించి అందరూ స్పెషల్ గా మట్లాడుకునేలా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది. చీరకట్టినా ఆమె ఇచ్చే ఫోజులకు ఎవ్వరైనా ఫిదావ్వాల్సిందే. తాజాగా అనసూయ చీరకట్టులో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది.
రాజస్థానీ మహిళలా ఆ చీరకట్టు, కట్టుబొట్టు తో అనసూయ కొత్తగా కనిపించింది. ఓపెన్ బ్లౌజ్ తో ఫుల్ హ్యాండ్స్ తో అనసూయ క్రీమ్ కలర్ డిజైనర్ శారీ లో జడకట్టి జ్యుయలరీ వేసి చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా కనిపించింది. మీరు కూడా అనసూయ న్యూ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.