అసలే హరి హర వీరమల్లు గత ఐదేళ్లుగా సెట్ పై ఉండి పలుమార్పు విడుదల తేదిని మార్చుకుంటూ ఎట్టకేలకు ఈ నెల 24 న విడుదలకు సిద్దమైంది. మేకర్స్ పవన్ కళ్యాణ్ లేకపోయినా, రాకపోయినా వీరమల్లు ప్రమోషన్స్ కోసం ఏవో తంటాలు పడుతున్నారు. ఈలోపే హరి హర వీరమల్లుకి అనుకోని కష్టం వచ్చిపడింది.
అది బీసీ సంఘాలనేతలు హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకుంటామంటూ రచ్చ స్టార్ట్ చేసారు. కారణం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ముమ్మాటికీ కల్పితం. ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను, తెలంగాణ బందూక్, తెలంగాణ రాబిన్ హుడ్ ను తీసుకొని ఒక కల్పిత పాత్రతో ఈ సినిమా రూపొందించారు.
కానీ వాళ్ళు చేసిన తప్పులను సమర్థించుకోడానికి ఇది పండుగ సాయన్న కథ కాదని, ఇది 1336లో విజయ నగరం సామ్రాజ్యం స్థాపించిన హరి హర రాయలు బుక్క రాయలకు సంబంధించిన కథ అని చెప్పుకుంటున్నారు. హరి హర వీరమల్లు ట్రైలర్ చూసాక అందులోని కంటెంట్ ను బట్టి, యూట్యూబ్ లో వచ్చిన కథనాలు, ఆర్టికల్స్ ఆధారంగా వీరమల్లు చిత్ర బృందాన్ని కొన్ని ప్రశ్నలు సూటిగా సంధిస్తున్నాం.
హరి హర రాయలు బుక్క రాయల తర్వాత 1406-10 మధ్య కాలంలోనే సాళ్వ వంశం అంతమవుతుంది. కానీ హరిహర వీరమల్లుట్రైలర్ లో 1650 - 1707 మధ్య జీవించిన ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్లు చూపించారు. ఔరంగజేబుకు హరి హర రాయలకు మధ్య 300 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఈ వీరమల్లు సినిమాలో హరి హర రాయలకు సమకాలీనులుగా చూపిస్తున్నారు. చరిత్రలో వారి మధ్య 200 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇదెలా సాధ్యం.. అంటూ వారు ఫైర్ అవడమే కాదు వీరమల్లు సినిమా విడుదల అడ్డుకుంటామంటూ వారు హరిహర వీరమల్లు చిత్ర బృందాన్ని హెచ్చరిస్తున్నారు.