దర్శకుడు బుచ్చిబాబు పెద్ది షూటింగ్ ని చకచకా పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ కి పర్ఫెక్ట్ గా డేట్స్ కేటాయించడమే కాదు.. బుచ్చిబాబు తో కలిసి చరణ్ పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ లోకల్ రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక నాసిక్ షెడ్యూల్ మోదవుతుంది.
అక్టోబర్ నాటికి పెద్ది షూటింగ్ ఫినిష్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. లేదంటే నవంబర్ కల్లా పెద్ది షూటింగ్ మొత్తం కంప్లీయా అయ్యేలా చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఢిల్లీ స్టేడియం లో పెద్ది క్రికెట్ మ్యాచ్ ని ఫైనల్ షెడ్యూల్ గా ప్లాన్ చేసాడని సమాచారం. ఈ క్రేజీ అప్ డేట్ తో ఫ్యాన్స్ ఉత్సాహపడిపోతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బుచ్చి బాబు అడిగిన డేట్స్ ను కేటాయిస్తూ పెద్ది షూట్ లో పాల్గొంటుంది. పెద్ది ఫస్ట్ గ్లింప్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే కి పెద్ది రిలీజ్ డేట్ లాక్ చేసి బుచ్చిబాబు షూటింగ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి క్రేజీ నటులు భాగమయ్యారు.