మహేష్ అభిమానులకు గత ఆరు నెలలుగా SSMB 29 అప్ డేట్ కోసం ఎదురు చూడని రోజు లేదు. సీక్రెట్ గా పూజ కార్యక్రమాలు చేసేసిన రాజమౌళి SSMB 29 అప్ డేట్ విషయంలో ఎందుకో చాలా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. దానితో అభిమానులు విసిగివేసారిపోతున్నా రాజమౌళి ని ఏమి అనలేని పరిస్థితి.
ఇతర హీరోల అభిమానులా మేకర్స్ ని దుమ్మెత్తిపోయ్యలేరు. మహేష్-ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇలా క్రేజి నటులతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై పాన్ ఇండియా లో భీభత్సమైన అంచనాలున్నాయి. మార్చ్ లో SSMB 29 సెట్ నుంచి మహేష్ వీడియో ఒకటి లీకై సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి నో హడావిడి.
మరి మహేష్ అభిమానులు ఇంకెంత కాలం ఎదురు చూడాలి, మహేష్ SSMB 29 పై అప్ డేట్ వచ్చే సమయం ఆసన్నమైంది. అది ఆగష్టు 9 మహేష్ బర్త్ డే రోజున. మహేష్ రాజమౌళి పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యేలా ట్రీట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అది కూడా ఓ వీడియో కట్ తో ఆ ట్రీట్ ఉండబోతుంది అంటున్నారు.
మహేష్ అభిమానులను వెయిట్ చేయిస్తే చేయించారు కానీ.. వాళ్లకు సంబరాలు చేసుకోవడానికి అదిరిపోయే ఫుల్ మీల్స్ మాత్రం రాబోతుంది అని టాక్.