Advertisementt

బ్యూటీ ఒంట‌రి పోరాటం

Sun 06th Jul 2025 08:33 PM
tara sutaria  బ్యూటీ ఒంట‌రి పోరాటం
Tara Sutaria calls her Bollywood journey బ్యూటీ ఒంట‌రి పోరాటం
Advertisement
Ads by CJ

ప‌రిశ్ర‌మ‌ లోప‌లి వ్య‌క్తి, బ‌య‌టి వ్య‌క్తి అంటూ ఇన్న‌ర్ పాలిటిక్స్ పై చాలా చ‌ర్చ సాగుతోంది. ఔట్ సైడ‌ర్స్ కి అవ‌కాశాలు రానివ్వ‌కుండా కొంద‌రు గ్రూపులుగా ఏర్ప‌డి బాలీవుడ్ లో రాజ‌కీయాలు చేస్తుంటారని చాలా మంది వాపోయిన సంద‌ర్భాలున్నాయి. అయితే తాను ప‌రిశ్ర‌మ‌లో ఒంట‌రి పోరాటం చేసానని అన్నారు న‌టి తారా సుతారియా. క‌ర‌ణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రంతో ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన తారా త‌న కెరీర్ జ‌ర్నీలో ఒంట‌రిపోరాటం అంత సులువుగా లేద‌ని తెలిపింది. ప‌రిశ్ర‌మ నుంచి ఎవ‌రైనా త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు ఉండి ఉంటే బావుండేద‌ని భావించిన‌ట్టు తారా వెల్ల‌డించింది. ప‌రిశ్ర‌మ ఇన్ సైడ‌ర్స్ కి నాలెజ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, త‌న‌లాగా కొత్త‌గా వచ్చిన వారు అన్నీ తెలుసుకునేప్ప‌టికి పుణ్య‌కాలం గ‌డిచిపోతుంద‌ని కూడా అంది.

ఇక తారా సుతారియా త‌న ప్రియుడు ఆధార్ జైన్ నుంచి విడిపోయి వీర్ ప‌హారియాతో డేట్ చేస్తోంది. ఆధార్ మాత్రం త‌న స్నేహితురాలు అలేఖా అద్వానీ వివాహం చేసుకున్నాడు. ఇక తారా - వీరర్ ప‌హారియా ఇటీవల ఇటలీ వెకేష‌న్ కు వెళ్లారని వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ ప‌హారియా గతంలో సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసిన‌ట్లు పుకార్లు వచ్చాయి. ఈ జంట‌ బహిరంగ షికార్ల‌తో వార్తల్లో నిలిచారు. కానీ ఆ త‌ర్వాత ఈ జంట కూడా బ్రేక‌ప్ అయింది.

రణబీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ ల‌కు ఆధార్ జైన్ బంధువు. తారా నుంచి విడిపోయాక ఆధార్ ఫిబ్రవరి 2025లో తారా స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నాడు. ఆధార్ నుంచి విడిపోయిన తర్వాత తారా సుతారియా నటుడు అరుణోదయ్ సింగ్‌తో కొంతకాలం సంబంధంలో ఉంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఆమె ఆ పుకార్లను తోసిపుచ్చింది. అతడిని కేవలం `స్నేహితుడు` అని పేర్కొంది.

Tara Sutaria calls her Bollywood journey:

Tara Sutaria

Tags:   TARA SUTARIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ