బాలీవుడ్ లో నితిష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్ర గ్లింప్స్ విడుదలయ్యాక సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం లో రాముడి గా రణబీర్ కపూర్, రావణ్ గా హీరో యష్, సాయి పల్లవి సీతగా, సూర్పణక గా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. యష్ రావణ్ పాత్ర కి భార్యగా బ్యూటిఫుల్ కాజల్ ని మండోదరి పాత్ర కోసం ఎంపిక చేసారంటూ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో రామాయణపై మీమ్స్ స్టార్ట్ అయ్యాయి.
రావణ్ భార్య మండోదరి పాత్ర కోసం అందమైన కాజల్ ని తీసుకోవడంతో.. రావణుడి కి(యశ్) కి అంత అందమైన మండోదరి(కాజల్ అగర్వాల్) లాంటి భార్య ఉండగా సీత(సాయి పల్లవి) కోసం ఎందుకు వస్తాడు, అంత అందమైన భార్యను సీత కోసం ఎలా వదులుకుంటారు అంటూ కామెడీగా మాట్లాడుకుటనున్నారు.
సీత పాత్రలో సాయి పల్లవి ఉంది, కాజల్ ఆమె కన్నా అందంగా ఉంటుంది. అలాంటి అందాన్ని సాయి పల్లవి కోసం యష్ వదులుకుంటాడా అంటూ సరదాగా మీమ్స్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు నెటిజెన్స్.