టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల అటు బాలీవుడ్‌లోను జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోంది. ఇది ఆషిఖి సీక్వెల్ అని ప్రచారం సాగినా, అలాంటి కథతో అదే జానర్‌లో రూపొందే ఒక కొత్త ప్రాజెక్ట్! అని కార్తీక్ ఆర్యన్ గతంలో వెల్లడించాడు. గాయనితో ప్రేమాయణంలో కార్తీక్ దేవదాస్ అయిపోతాడట.
కెరీర్ ఆరంభమే కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరో సరసన అవకాశం అందుకున్న శ్రీలీల లక్కీ గాళ్ అంటూ ప్రచారం సాగిపోతోంది. పైగా ఆషిఖి జానర్ లో వస్తున్న సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేయడం ఖాయమని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఆఫ్ ద స్క్రీన్ కూడా శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ రొమాన్స్ చేస్తున్నాడన్న ప్రచారం సాగిపోతోంది. కార్తీక్ తో నిరంతరం డిన్నర్ డేట్ లు, ఔటింగులతో శ్రీలీల కెమెరాలకు చిక్కుతోంది.
ఇప్పుడు ఈ అందాల భామ బాలీవుడ్ లో మరో అగ్ర కథానాయకుడి సరసన అవకాశం అందుకుందన్న ప్రచారం సాగిపోతోంది. అది ఏ ప్రాజెక్ట్ అన్న డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ, ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తోందని ఇప్పటికి సమాచారం ఉంది. అలాగే ఓ జాతీయ స్థాయిలో టెలీకాస్ట్ అయ్యే భారీ వాణిజ్య ప్రకటన కోసం దర్శకుడు అట్లీతో కలిసి పని చేస్తోంది.
ఈ ప్రకటనలో అగ్ర హీరో సరసన నటిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రఖ్యాత మెహబూబ్ స్టూడియోస్ లో శ్రీలీల ప్రత్యక్షమవ్వడంతో ఈ బ్యూటీ ఇంకేదో భారీ ప్రాజెక్టుకు కూడా కమిటయ్యే ఛాన్సుందని హిందీ మీడియాలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఇది ఒక అగ్ర హీరోతో వాణిజ్య ప్రకటన వరకేనా, అతడితో సినిమా కూడా చేస్తోందా? అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.