మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కలయికలో క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన #Mega157 షూటింగ్ ని చక చకా చుట్టేస్తున్నారు దర్శకుడు అనిల్. ఇప్పటికే #Mega157 కి సంబందించిన పలు షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్రను చాలా ఫన్నీగా డిజైన్ చేశారట. ఈ Mega 157 లో 70 శాతం కామెడీ, 30 శాతం డ్రామా ఉంటుందని తెలుస్తుంది.
చిరు కి జోడిగా నయనతార నటిస్తుంది. ఈ చిత్రంలో నయనతార-చిరు భార్యా భర్తలుగా కనిపించబోతున్నారట. డ్రిల్ మాస్టర్ గా చిరు ఓ రేంజ్ లో కామెడీ పండిస్తారని చెబుతున్నారు. చిరు కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా వింటేజ్ క్యారెక్టరైజేషన్ ఇందులో డిజైన్ చేశాను అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చిరు కేరెక్టర్ పై ఎలివేషన్ ఇచ్చాడు.
అంతేకాకుండా చిరు, నయనతారల మధ్య భార్యా భర్తల బాండింగ్ కొత్త తరహాలో ఉంటుందని అనిల్ రావిపూడి చిన్న క్లూ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే విషయంలో, ఆయన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పకుండా అనిల్ రావిపూడి ఊరించేసారు. సమయం వచ్చినప్పుడు అదో బ్లాస్టింగ్ న్యూస్ అంటూ వెంకీ గెస్ట్ రోల్ పై అనిల్ రావిపూడి హైప్ క్రియేట్ చేసారు.