Advertisementt

వీరమల్లు పరిస్థితి ఏమిటి

Fri 04th Jul 2025 04:17 PM
hari hara veera mallu  వీరమల్లు పరిస్థితి ఏమిటి
Hari Hara Veera Mallu Trailer Creates History వీరమల్లు పరిస్థితి ఏమిటి
Advertisement
Ads by CJ

హరి హర వీరమల్లు చిత్రం విడుదల పదే పదే వాయిదా పడడం ఆ చిత్రం క్రేజ్ ను తగ్గించింది అనే వార్తలు పవన్ ఫ్యాన్స్ కు కునుకు రానివ్వకుండా చేసాయి. హరి హర వీరమల్లు ట్రైలర్ వస్తుంది మొత్తం లెక్క మారిపోతుంది అంటూ మేకర్ ఎంత నమ్మకం చూపించారో అందరూ చూసారు. 

ఆ నమ్మకం నిజమైంది. వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది, లెక్కలన్నీ మారిపోయాయి. పాన్ ఇండియా మార్కెట్ కి హరి హర వీరమల్లు ట్రైలర్ ఎంత రీచ్ అయ్యిందో పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ కు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు హరి హర వీరమల్లు ట్రైలర్ విపరీతంగా నచ్చేసింది. యూట్యూబ్ లోను వీరమల్లు ట్రైలర్ రికార్డ్ వ్యూస్ కలెక్ట్ చేసింది. పవన్ లుక్స్, యాక్షన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

హరి హర వీరమల్లు లో వీరమల్లు గా పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్ ట్రైలర్ చూస్తే చాలు, విలన్ గా బాబీ డియోల్, అలాగే నిధి అగర్వాల్ క్యూట్ లుక్స్ అన్ని అద్దిరిపోయాయి, వీరమల్లు ట్రైలర్ కు పిచ్చ క్రేజ్ వచ్చేసింది.. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరోలెక్క అంటూ పవన్ ఫ్యాన్స్ వీరమల్లు ట్రైలర్ పై స్పందించారు. 

Hari Hara Veera Mallu Trailer Creates History:

Hari Hara Veera Mallu Trailer Is The Most Viewed In South Indian Cinema

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ