సినిమా నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పాడైపోవడంతో ఫిష్ వెంకట్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయారు. కొంతమంది ఫిష్ వెంకట్ అనారోగ్యం విషయం తెలుసుకుని ఆయన కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తూ అండగా నిలబడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ రోజూ డయాలసిస్ చేయించుకుంటున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన టీమ్ తో ఫిష్ వెంకట్ ఆసుపత్రి కి ఎంత ఖర్చవుతుందో అన్ని వివరాలు తెలుసుకుని బిల్లులు చెల్లించేందుకు ముందుకొచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ అసిస్టెంట్ తనకు కాల్ చేసిన విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఫిష్ వెంకట్ కి సరిపోయే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు ఎవరైనా ముందుకు వచ్చి కిడ్నీ దానం చేస్తే సర్జరీ చేయించడానికి సిద్ధమని ప్రభాస్ అసిస్టెంట్ చెప్పినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ సర్జరీకి రూ.50 లక్షల దాకా ఖర్చవుతుందని వెంకట్ తనయురాలు చెప్పింది. అయితే ప్రస్తుతం డయాలసిస్ స్టేజ్ దాటిపోయింది అని, కిడ్నీ డోనర్ దొరికితే కిడ్నీ మార్పిడి ముఖ్యమని ఆమె తెలిపింది.
కాకపోతే కిడ్నీ దొరకడం కష్టంగా ఉందని, తాము కిడ్నీ డొనేట్ చెయ్యడానికి తన తండ్రిది వేరే బ్లడ్ గ్రూప్ అని.. తమది వేరే గ్రూప్ అని ఆమె వెల్లడించింది. మరి ప్రభాస్ అంత భారీ సహాయం చేస్తున్నా ఆ విషయం ఎవ్వరికి తెలియదు. ఇలాంటి సహాయాలు ప్రభాస్ ఖాతాలో చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే బయటికి వచ్చాయి. ప్రభాస్ ది పెద్దమనసు అంటూ ఆయన అభిమానులు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.