గత వారం కన్నప్ప లాంటి పాన్ ఇండియా చిత్రం విడుదల తర్వాత ఈ వారం జులై నెలకు బోణీకొడుతూ నితిన్ తమ్ముడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. నితిన్-వేణు శ్రీరామ్ కలయికలో దిల్ రాజు తెరకెక్కించిన తమ్ముడు ఈరోజు జులై 4 న థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ టాక్ తో తమ్ముడు చిత్రంపై ఆడియన్స్ అభిప్రాయాలను చెప్పడం మొదలు పెట్టేసారు.
ఇదే రోజు జులై 4 న హీరో సిద్దార్థ్ నటించిన 3BHK మూవీ విడుదలైంది. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం బాక్సాఫీసు మీద దండయాత్ర చేస్తున్న సిద్దు ప్రతి సినిమాని తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. వాటితో పాటుగా కీర్తి సురేష్-సుహాస్ ల ఉప్పుకప్పురంబు నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
అంతేకాకుండా నవీన్ చంద్ర నటించిన షో టైం కూడా రిలీజ్ అయ్యింది, మంచి ప్రమోషన్స్ తో షో టైం థియేటర్స్ లో విడుదల కాగా.. మరో చిన్న సినిమా బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి ఈ రోజు జులై 4 న విడుదలైన ఈచిత్రాలలో గెలుపెవరిది, ఓటమెవరిదో అనేది మరికొన్ని గంటల్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.