సందీప్ వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్ప్పుడు స్పిరిట్ చిత్రాన్ని మొదలు పెడతారా అని ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ రెండు మూడు చిత్రాల షూటింగ్స్ బిజీ లో పడి ఆయన స్పిరిట్ కి డేట్స్ కేటాయించలేకపోతున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ మాత్రమే కాదు నటుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రభాస్ కోసం కాచుకుని కూర్చున్నారు.
అయితే ఈ జూన్ నుంచి స్పిరిట్ మొదలవుతుంది అంటూ సందీప్ రెడ్డి చెప్పుకొచ్చినా అది జరగలేదు, తాజాగా సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ చిత్రం సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది అంటూ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
సందీప్ రెడ్డి ప్రభాస్ ని బల్క్ డేట్స్ అడగడడంతోనే ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేసి స్పిరిట్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారట. అందుకే స్పిరిట్ స్టార్ట్ అవడం లేట్ అయ్యింది అని తెలుస్తుంది. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మొదలైతే వచ్చే ఏడాది మిడిల్ వరకు ప్రభాస్ స్పిరిట్ సెట్ లోనే ఉండాల్సి ఉంటుంది. మరి ఈలెక్కన కల్కి 2 పరిస్తితి ఏమిటో చూడాలి.